వైభవంగా శివ పార్వతుల కళ్యాణం
*శివనామ స్మరణతో మార్మోగిన ఆలయం
కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణ పండితుడు పోలుకొండ వెంకటేశ్వర శర్మ,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేంద్ర శర్మ, కృష్ణ మోహన శర్మ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.ఆలయ పునర్ వ్యవస్థాపకులు అన్నావజ్జుల సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.మహాశివరాత్రిని పురస్కరించుకొని వేకువ జామునే భక్తులుఅభిషేకాలు,అర్చనలు,అష్టోత్తర శతకలష పూజ,పూర్ణాహుతి హోమానికి బారులు తీరారు.ఈఉత్సవాలలో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివపార్వతుల ఉత్సవ విగ్రహాల దాత శ్రీ ఎడ్ల మల్లారెడ్డి,గూడూరు కనకం స్వామివార్లను ఎదుర్కోలు నిర్వహించి కళ్యాణాన్ని రాత్రి 9 గంటలకు కన్నుల పండుగ నిర్వహించారు.కళ్యాణం అనంతరం లింగోద్భవ కళశాభిషేకాలు,35 రకాల సుగంధ ద్రవ్యాలతో కలిపిన 108 కళాశాలతో అభిషేకం నిర్వహించారు.ఈఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.దాతలు అందించిన ఆర్ధిక సహాయంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెదమామూల యాకయ్య,ఉప సర్పంచ్ కాస యాకయ్య, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్ సుంకరి సాంబయ్య,భక్తులు బొల్లం రమేష్ రమేష్,కొండబత్తిని జగదీశ్వర్,బాతిని సంతోష్,కొండబత్తిని రవి కుమార్, అలువాల నవీన్ కుమార్,దాతలు తదితరులు పాల్గొన్నారు.



