వైభవోపేతంగా మహా రుద్ర యాగం
వేద ఘోషతో మార్మోగిన ఆలయ ప్రాంగణం
రుద్రుడి ఆశీస్సులకై శాస్త్రోక్తంగా ‘అగ్ని స్థాపన’ క్రతువు
వేద మంత్రాల నడుమ పవిత్ర అగ్ని జననం
యాగశాల ప్రాంగణం వేద ఘోషతో మార్మోగింది
కార్తీక మాస మహా రుద్ర యాగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు
కాకతీయ, పరకాల: సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు నిర్వహించిన కార్తీక మాస మహారుద్ర యాగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ఉదయం విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, యాగశాల ప్రవేశం, రుత్విక్ వరణం, గోపూజ కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వేద పండితులు రుద్ర నమకం, చమకాలను పఠిస్తూ మహా రుద్ర హోమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.లోక కల్యాణం,ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ స్థానిక ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో తలపెట్టిన శ్రీ మహా రుద్ర యాగం సోమవారం రోజున 51 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.159 హోమ గుండాలు,644 లు జంటలు ఈ హోమంలో పాల్గొనటం విశేషం.’ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం, వేద మంత్రాల ఘోషతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.యాగంలో పాల్గొన్న భక్తులు, ప్రతికూల శక్తుల నుండి రక్షణ, కుటుంబంలో సంతోషం లభిస్తాయని విశ్వసిస్తూ శివుని అనుగ్రహం కోసం మొక్కులు చెల్లించుకున్నారు.

యాగంలో పాలుపంచుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా భోజన సదుపాయం కల్పించే ఉద్దేశంతో ఇనుగాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.యాగ స్థలంలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడంతో పాటు,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు విశిష్ట సేవలను అందించారు.వీరితోపాటు అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో సేవలందించి యాగకురతో దిగ్విజయంగా ముగియడంలో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమం లో ఏసీపీ సతీష్ బాబు, సీఐ క్రాంతి కుమార్, కట్కూరి దేవేందర్ రెడ్డి, పర్నెం మల్లారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్ రావు, సిద్ధాంతి కోమల్ల సంపత్ కుమార్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.



