epaper
Saturday, March 14, 2026
epaper

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..!

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..!
సారలమ్మ ఆగమనంతో వనదేవతల వేడుకలకు శ్రీకారం
తొలిరోజు సాయంత్రం గద్దెపైకి సారలమ్మ
కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాక
తల్లి రాక కోసం లక్షలాది భక్తుల ఎదురు చూపు
జనంతో కిటకిటలాడుతున్న మేడారం వనం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఖ్యాతి పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర – 2026 నేడు (జనవరి 28) అధికారికంగా ప్రారంభమవుతోంది. వనదేవతల దర్శనానికి లక్షలాది భక్తులు ఇప్పటికే మేడారం బాట పట్టారు. దారులన్నీ మేడారం వైపే మళ్లినట్టుగా కనిపిస్తున్నాయి. చీమల పుట్టలోలే భక్తజనం తరలివచ్చి మేడారం అడవిని నింపేసింది. జాతరలో భాగంగా తొలిరోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు గద్దెపైకి చేరుకోనున్నారు. ఆదివాసీ సంప్రదాయాల నడుమ అమ్మవారి ఆగమనాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో స్వాగతించనున్నారు. సారలమ్మ రాకతో జాతర వాతావరణం ఉత్సాహంతో మార్మోగనుంది.

ఇతర దైవాల రాక

సారలమ్మతో పాటు కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులను కూడా ఆదివాసీ ఆచారాల ప్రకారం మేడారం గద్దెలకు తీసుకువస్తారు. ఈ ఘట్టంతో మేడారం అడవులు మంత్రోచ్చారణలు, డప్పుల మోతలతో ఆధ్యాత్మిక శబ్దాలతో మార్మోగనున్నాయి. జాతర సందర్భంగా భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. జాతర ప్రారంభంతో వాగు పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు గద్దెల వైపు అడుగులు వేస్తున్నారు.

మేడారం జాతర–2026 పూర్తి షెడ్యూల్
జనవరి 28 (బుధవారం): సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దె ప్రతిష్ఠ
జనవరి 29 (గురువారం): చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం
జనవరి 30 (శుక్రవారం): నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పణతో ప్రధాన ఘట్టం
జనవరి 31 (శనివారం): వనదేవతల వన ప్రవేశంతో జాతర ముగింపు
మొత్తానికి, వనదేవతల కటాక్షం కోసం భక్తుల అడుగులు మేడారం వైపే పడుతున్నాయి. సారలమ్మ ఆగమనంతో మొదలైన ఈ మహా జాతర రోజురోజుకూ మరింత వైభవంగా సాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగులో గ్యాస్ కొరత లేదు

ములుగులో గ్యాస్ కొరత లేదు బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాపై కలెక్టర్...

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్ దళిత యువతిని మోసం చేసిన కేసులో అరెస్టు పెళ్లి చేస్తానని...

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,...

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు టెన్త్ ప‌రీక్ష కేంద్రాల‌ను తనిఖీ చేసిన కలెక్టర్ మౌలిక...

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది రావిరాల లో 10 లక్షల...

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ కాకతీయ, గీసుగొండ: దేశం...

న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం

న్యాయం చేయండి.... అర్హురాలికి అన్యాయం... - అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు - మెరిట్...

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆవేదన కాకతీయ, ములుగు ప్రతినిధి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img