epaper
Monday, March 2, 2026
epaper

పేదలకు వసతుల క‌ల్ప‌నే ప్ర‌భుత్వ ధ్యేయం

పేదలకు వసతుల క‌ల్ప‌నే ప్ర‌భుత్వ ధ్యేయం
రెండేళ్ల‌లో పెద్దతండాలో రూ.56కోట్ల‌తో అభివృద్ధి
యుద్ధప్రాతిపదికన మున్నేరుపై రిటైనింగ్ వాల్
రెవెన్యూ, హౌజింగ్ శాఖల‌ మంత్రి పొంగులేటి
ఏదులాపురంలో సీసీ రోడ్లకు శంకుస్థాప‌న‌
సీసీ రోడ్లతో కాలనీలకు కొత్త రూపు

కాకతీయ, ఖమ్మం/ఏదులాపురం : పేదలకు మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. టెంపుల్ సిటీలో రూ.33.90 లక్షలు, చిన్న తండాలో రూ.20.33 లక్షలు, సూర్యనగర్‌లో రూ.24.87 లక్షలు, నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో రూ.24.87 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ఏదులాపురం పెద్దతండా గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండేళ్లలో రూ.14 కోట్లతో పలు మౌళిక వసతుల పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పెద్దతండాలో నూతనంగా నివాసం ఉంటున్న ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రారంభమవుతుందని, ప్రతి సంవత్సరం ఈ పథకం కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు.

మున్నేరు రిటైనింగ్ వాల్ యుద్ధప్రాతిపదికన
నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో గత వరదల నేపథ్యంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించిందని, భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా రూ.580 కోట్లతో మున్నేరు నదికి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి రాబోయే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 10 రోజుల్లో కాలనీలో అవసరమైన మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఏదులాపురాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా గుర్రాలపాడు తండాలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు నునావత్ భారతి నిర్మించుకున్న ఇంటిని మంత్రి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీ సునీల్ దత్, ఆర్&బీ ఈఈ యాకుబ్, ఇరిగేషన్ ఈఈ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాధ్ బాబు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img