రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ గుమ్మడి సోమయ్య
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కాకతీయ, మంగపేట : రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ గుమ్మడి సోమయ్య తెలిపారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో వివేకా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క నాయకత్వంలో రైతులకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
వివేక ఎఫ్పిఓ సేవలు అభినందనీయం
నాసిరెడ్డి సాంబశివరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివేక రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతులకు విత్తనాలు, పిచికారి యంత్రాలు, శిల్పాలిన్ కవర్లు సబ్సిడీపై అందించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్యాడీ ప్రోక్యూర్‌మెంట్ సెంటర్ మంజూరు చేసినందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గుమ్మడి సోమయ్యను కాంగ్రెస్ నాయకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సయ్యద్ షా పైసల్ హుస్సేని, కృష్ణవేణి, విజయ్ కుమార్, తోట రవీందర్, బద్రు నాయక్, టీవీఆర్ సూరి, అనుముల శ్రీనివాస్, మైల జయరామిరెడ్డి, రాంబాబు, చేరాలు, భావన, కృష్ణవేణి, ఐకెపి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.


