రిటైర్డ్ ఉద్యోగుల బాధను ప్రభుత్వం గమనించాలి
మానవీయ దృక్పథంతో పరిష్కారాలు అవసరం: ఎం.ఏ. ఖాద్రీ
కాకతీయ, కరీంనగర్: రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు భవిష్యత్తుపై భయంతో, కుటుంబ అవసరాలు తీర్చలేక నిత్యం వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యలు రేపు పనిచేస్తున్న ఉద్యోగులకూ తప్పవని ప్రభుత్వం గుర్తించాలన్నారు. మానవీయ దృక్పథంతో ఆలోచించి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ఖాద్రీ ప్రభుత్వాన్ని కోరారు.


