- హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కాకతీయ, హుజురాబాద్: మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు రైతులకు ఎలాంటి సాయం అందించకపోవడం దుర్మార్గమని అన్నాడు. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగం అవుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం మంత్రులు పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శంచారు. రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని, అన్నదాతలను ఆదుకోవడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని మండిపడ్డారు. తక్షణసాయంగా వరికి ఎకరానికి రూ.25వేలు ప్రభుత్వం ప్రకటించి నష్టపోయిన రైతులందరికీ ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనాలని కోరారు.


