కాకతీయ, ఆదిలాబాద్: అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం సందర్భంగా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన కళాకారులు మేశ్రమ భగవాన్ దాస్, రాములును శాలువతో సత్కరించారు. శనివారం ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్, కళాకారుడు కాత్లే శ్రీధర్ మాట్లాడారు. ఆదివాసీ బిర్ధ్ గోండు జాతికి చెందిన కిక్రీ వాయిద్యాకారులు మేశ్రం భగవాన్ దాస్, సెడ్మకి రాములు కిక్రి వాయిద్యాన్ని నేర్చుకొని అదే వృత్తిగా జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుండి వారికి ఎలాంటి లబ్ది కలుగలేదు. మరి కొంతమంది కళాకారులు పెప్రే కలికోం వంటి వాయిద్యాలు వాయించి శ్వాస కిడ్నీ సంబంధిత వ్యాధులతో చనిపోయారు. ప్రస్తుతం కిక్రి వాయిద్యం కనుమరుగయ్యే అవకాశం ఉంది. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 ఏళ్లకు పైబడిన కళాకారులకు రూ.5వేల పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు వంటి సదుపాయాలను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తోసం పటేల్, బిర్ధ్ గోండు సంఘం గౌరవ అధ్యక్షుడు పెందుర్ ఆనంద్ రావు, మాజీ సర్పంచ్ కుమ్రా శంభు, సత్యమ్మ, రుక్మిణి బాయి, గేడం సీతారాం, నరేష్, చంద్రకాంత్, గణేష్, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


