కాకతీయ, నర్సంపేట: నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని, బోగస్ మాటలతో ఇస్తామన్న బోనస్ అమలు చేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులోని మొక్కజొన్న పంట ధాన్య రాసులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా కొరత మొదలుకుని వరి, మొక్కజొన్న, పత్తి పంటల్లో సగం పైబడి దిగుబడి నష్టపోవడం జరిగిందన్నారు.
ప్రస్తుతం మొక్కజొన్న పంట ముందుగా చేతికి వచ్చిందని, ఇప్పటి వరకు రైతు రూ. 1951ధరకి రైతుల అమ్ముకునే దుస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన లేకపోవడంతో రైతులకు సంబంధించిన పంటల కొనుగోళ్లలో కుంభకోణాలు చేయాలా, సంపాదించాల అనే ఆలోచన తప్ప రైతులను ఎన్నడు ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు.
దిగుబడి తగ్గడానికి యూరియా కొరతకు కారణం కొరతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణమని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కారణమేనని ఆరోపించారు. వెంటనే ప్రతి ఎకరాకు రైతుకు 25వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారానికి వస్తున్న సందర్భంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్సెస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.


