మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!
ఇందిరమ్మ చీరల పంపిణీలో జెడ్పీ సీఈవో పురుషోత్తం
కాకతీయ, మరిపెడ : మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని డి. పురుషోత్తం స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో మంగళవారం మెప్మా ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్లుగా పనిచేస్తున్న 14 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ సీఈవో, *రామడుగు విజయనాథ్*తో కలిసి మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో వీధి విక్రయదారులకు ప్రభుత్వం నుంచి 1,216 మంది మహిళలకు సుమారు రూ.1.24 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం నిరంతరం చేయూతనందిస్తోందని, అందుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా డీఎంసీ విజయలక్ష్మి, సెమీమ్ పులి ఉమా, గంధసిరి ఉమా, రాజేశ్వరి, రజిత, పార్వతి, ఉమారాణి, లక్ష్మి, స్వరూప, సరిత, మమతతో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


