epaper
Thursday, January 15, 2026
epaper

ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం!

ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం!
బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేత
కాంగ్రెస్ ఏడాదిలోనే మరో 1500 స్కూల్స్‌కు తాళాలు వేసింది
ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలతో కాలేజీలు మూత
విద్యార్థులపై భారం పెడితే ఉద్యమమే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న బండి సంజయ్

కాకతీయ, హైదరాబాద్ : బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్య విఫలమైతే ఒక తరం నష్టపోతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో అదే జరుగుతోందని ఆయన హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ శంషాబాద్‌లోని ఎస్సాస్సార్ కన్వెన్షన్‌లో జరిగిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని తెరవకపోగా ఒక్క ఏడాదిలోనే మరో 1500 స్కూల్స్ మూసివేశారని విమర్శించారు. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్న హామీ గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వందలాది కాలేజీలు మూతపడుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని ఆరోపించారు. గత నాలుగేళ్లుగా దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఈ విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. విద్యా రంగ సమస్యలపై ఏబీవీపీ చేస్తున్న ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

నల్లజెండాలు టెర్రరిస్టులవి… ఏబీవీపీదే జాతీయ జెండా

దేశంలో నల్లజెండాలు ఎగరేసేది టెర్రరిస్టులు, నక్సలైట్లు మాత్రమేనని బండి సంజయ్ విమర్శించారు. నల్లజెండాలను ఎదిరిస్తూ జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించింది ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలేనని గుర్తు చేశారు. 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పోరాడిన చరిత్ర ఏబీవీపీదేనని తెలిపారు. అమరుల త్యాగాల స్పూర్తితోనే మోదీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం సాధించిందన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా పానగల్‌కు చెందిన సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్‌కు ‘జనమంచి గౌరీశంకర్ జీ యువ పురస్కార్’ను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేశారు. హెచ్ఐవీ బాధితులు, వారి పిల్లల కోసం చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.
జనమంచి గౌరీశంకర్ జీ ఏబీవీపీకి ఐకాన్ అని, విద్యా సమస్యలపై పోరాటాలు చేసి ఎంతో మంది విద్యార్థి నాయకులను తయారు చేసిన నేత అని కొనియాడారు. నక్సల్స్ బెదిరింపులను ఎదుర్కొంటూ కూడా ఏబీవీపీ సిద్ధాంతాల కోసం నిలబడిన నాయకుడిగా ఆయనను గుర్తు చేశారు.

విద్య విఫలమైతే… తరం నష్టమే

పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో స్కూళ్లలో టీచర్లు లేరు, మౌలిక వసతులు లేవు, అయినా ప్రభుత్వానికి సిగ్గు లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో రెండు తరాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. గౌరీశంకర్ జీ స్పూర్తితో విద్యా రంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ మహాసభల వేదికగా ఏబీవీపీ నాయకులను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

జాగృతిలో అధ్యయన కమిటీ ఏర్పాటు!

జాగృతిలో అధ్యయన కమిటీ ఏర్పాటు! ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి కమిటీ సభ్యుడిగా...

ఆహార కల్తీపై ఉక్కుపాదం!

ఆహార కల్తీపై ఉక్కుపాదం! ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు కల్తీని హత్యాయత్నంగా పరిగణిస్తాం ప్రత్యేక బృందాలు,...

క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్!

క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్! డయల్–100కు సమాచారం.. వెంటనే రంగంలోకి...

గంద‌ర‌గోళంగా మునిసిప‌ల్ ఓట‌ర్ల జాబితా

గంద‌ర‌గోళంగా మునిసిప‌ల్ ఓట‌ర్ల జాబితా వేరే నియోజకవర్గాల ఓటర్లు మున్సిపాలిటీల్లో నమోదు పూర్తిస్థాయి ఎంక్వైరీ...

యూరియా కొరతపై చర్చ పెట్టండి

యూరియా కొరతపై చర్చ పెట్టండి స‌భ‌లో వాయిదా ప్రతిపాదన ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రైతుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img