epaper
Wednesday, January 21, 2026
epaper

పార్టీలకతీతంగా సంక్షేమమే లక్ష్యం

పార్టీలకతీతంగా సంక్షేమమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కొత్త ప్రణాళిక
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కల్యాణలక్ష్మి–సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కాకతీయ, గీసుగొండ : పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గీసుగొండ మండలం కొనాయిమాకుల రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలు, 15, 16 డివిజన్ల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 46 మంది లబ్ధిదారులకు రూ.46 లక్షల 5 వేల 336 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులు, 35 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల 20 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం పెద్ద దన్నుగా నిలుస్తోందని అన్నారు.

డబ్బు రాజకీయాలతో నష్టమే
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన చేస్తూ, డబ్బులిచ్చే వారికే ఓట్లు వేయడం వల్ల ప్రజలే తమ భవిష్యత్తును దెబ్బతీసుకున్నట్లవుతుందని వ్యాఖ్యానించారు. నిజాయితీగా పనిచేసే నాయకులను పక్కనబెట్టి డబ్బులకు ఆశపడితే సంక్షేమ పథకాలకు గండిపడుతుందని హెచ్చరించారు. వచ్చే సంవత్సరం నుంచి మండలంలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పిల్లలు ఇంటి దూరంగా హాస్టళ్లలో చదువుకోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇంటి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించిన ఎమ్మెల్యే, ప్రస్తుత ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎం.డి. రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఆకుల సర్పంచ్ వజ్రా రాజు, ఊకల్ సర్పంచ్ కక్కేర్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజల చూపు బీజేపీ వైపు

ప్రజల చూపు బీజేపీ వైపు నర్సంపేటలో 40 కుటుంబాల చేరిక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై డాక్టర్...

మొంతా తుఫాన్ బాధితుడికి ప్రభుత్వ సాయం

మొంతా తుఫాన్ బాధితుడికి ప్రభుత్వ సాయం రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు బాధిత...

ఉజ్వల యోజన పథకం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

ఉజ్వల యోజన పథకం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి సర్పంచ్ మాదరి ప్రశాంత్ కాకతీయ, నెల్లికుదురు...

నగరం వెలిగిపోవాలె!

నగరం వెలిగిపోవాలె! అన్ని డివిజన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు అధికారులకు మేయర్ గుండు సుధారాణి...

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌!

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌! ఆరు గ్యారంటీల‌ను గాలికి వ‌దిలేసిన కాంగ్రెస్‌ 420 హామీలతో...

మేడారం జాతరకు శుభారంభం!

మేడారం జాతరకు శుభారంభం! ఘ‌నంగా మండే–మెలిగే పండుగ‌ సమ్మక్క–సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు గ్రామమంతా పండుగ...

శివనగర్‌లో కమిషనర్‌ పర్యటన

శివనగర్‌లో కమిషనర్‌ పర్యటన స్థానిక సమస్యలపై సమీక్ష కాకతీయ, ఖిలావరంగల్‌: చాహత్ బాజీపేయి శివనగర్‌లో...

చెత్త డ్యూటీ!

చెత్త డ్యూటీ! వరంగల్ బల్దియాలో విధుల పట్ల నిర్లక్ష్యం ఇష్టారాజ్యంగా పారిశుధ్య సిబ్బంది డ్యూటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img