గ్రామ అభివృద్దే లక్ష్యం
రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య
కాకతీయ, చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలతో 6వ వార్డులోని సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ శెట్టే కొమురయ్య కొబ్బరికాయలు కొట్టి నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొమురయ్య మాట్లాడుతూ.. గ్రామ అభివృద్దే తమ లక్ష్యమని,ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నిలపనున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ సూచించారు.గ్రామానికి అభివృద్ధి పనులు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు.గ్రామంలోని అన్ని కాలనీలలో మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో,బండారి అంజయ్య,షేవల్ల రాములు,బండారి సిద్దయ్య, బండారి సాయిలు,బీరయ్య, మల్లయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.


