బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం..
*బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా. పెసరు విజయచందర్ రెడ్డి
కాకతీయ,గీసుగొండ: బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా. పెసరు విజయచందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారంలో ఉన్న వరంగల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 రెండవ రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కార్యాచరణపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని, ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలలో సిద్ధాంత పరమైన,సంస్థాగత నైపుణ్యాలు పెంపొందు తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల కన్వీనర్ దేవునూరి మేఘనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యాలయ కార్యదర్శి కంది క్రాంతికుమార్, ఎలుగురు రంగంపేట సర్పంచ్ బెజ్జంకి శేషాద్రి, జిల్లా ఉపాధ్యక్షులు కూతురు రాజు, రాధారపు శివకుమార్, ములక ప్రసాద్, మొలుగూరి శ్రీనివాస్, సంగెం మండలం అధ్యక్షులు చంద్రమౌళి, గీసుగొండ మండలం అధ్యక్షులు కొంగర రవి కుమార్, 15వ డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్, 16వ డివిజన్ అధ్యక్షులు ప్రసన్న రాంప్రసాద్, 17వ డివిజన్ అధ్యక్షులు విజయ్, గోదాసి అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.


