గ్రామాల నుంచే క్రీడాకారుల గుర్తింపు లక్ష్యం
కరీంనగర్ జిల్లా క్రీడల అధికారి శ్రీనివాస్ గౌడ్
ఇల్లందకుంటలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ
కాకతీయ, జమ్మికుంట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ సీఎం కప్ టోర్నమెంట్ సన్నాహకాల్లో భాగంగా ఇల్లందకుంట మండలకేంద్రంలో శుక్రవారం టార్చ్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా క్రీడల అధికారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ రాజమల్లు టార్చ్ వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడమే సీఎం కప్ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, యువత క్రీడల్లో పాల్గొని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలని సూచించారు. ఈ నెల 17 నుంచి ఫిబ్రవరి 26 వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ సత్యనారాయణ, ఎస్సై క్రాంతి కుమార్, ఎంఈఓ రాములు నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.


