కాకతీయ, రాయపర్తి : మండలంలోని సూర్య తండ, ఏకే తండా గిరిజనులకు ప్రయాణం సులభతరం చేసేందుకు గాను నూతన బస్సు సేవలను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సోమవార టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. సూర్య తండా నుండి కొత్తూరు వరకు గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే, ఝాన్సీ రెడ్డి నూతన బస్సులో ప్రయాణించారు.
మండల కేంద్రంలో త్వరలో సేవాలాల్ భవనానికి శంకుస్థాపన చేస్తామని ఆమె తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన 72 మందికి రూ.72,08,352 లక్షల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన 34 మంది లబ్ధిదారులకు రూ.14,03,500 సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
స్వర్ణ భారతి మండల సమైక్య భవనంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 36 స్వయం సహాయక సంఘాలకు రూ.4,96,50,000 చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పెట్రోల్ బంక్, సోలార్ జనరేట్ ప్రాజెక్ట్, చార్జింగ్ బస్సులు మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో గుగులోత్ కిషన్, ఏపీఎం రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి, సరికొండ కృష్ణారెడ్డి, ఆకుల సురేందర్ రావు, ఎనగందుల మురళి, పాల్వంచ కోటేశ్వర్, వనజారాణి, కాశీనాథం, కళ్యాణ్ గౌడ్, పీరని ప్రవీణ్, వల్లపు కుమార్ తదితరులు పాల్గొన్నారు.


