- ములుగు కలెక్టర్ దివాకర
కాకతీయ, ములుగు ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అవగాహన పోస్టర్లను కలెక్టర్ దివాకర ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, విజిలెన్స్ సిబ్బందితో కలిసి అవినీతి నిరోధక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అధికారి, ఉద్యోగి తమ బాధ్యతలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అవినీతి రహిత పాలన సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు కూడా విజిలెన్స్ విభాగాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 14432 ను, అలాగే ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ అధికారిక అకౌంట్లను ఉపయోగించి సమాచారం ఇవ్వవచ్చనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, విజిలెన్స్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


