సరస్వతీ శిశు మందిర్‌లో యజ్ఞ వైభవం
పుష్య పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో పుష్య మాస పౌర్ణమి సందర్భంగా యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ యజ్ఞానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ యజ్ఞంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, అప్పిడి రాజిరెడ్డి, వకుళాదేవి, పులాల శ్యామ్, తణుకు మహేష్ పాల్గొని భక్తిశ్రద్ధలతో ఆహుతులు సమర్పించారు. యజ్ఞాన్ని శ్రీవత్సల మురళి వైదిక పద్ధతుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… పుష్య మాస పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఉపవాసాలకు అత్యంత శుభప్రదమైన సమయమని పేర్కొన్నారు. యజ్ఞాలు, వ్రతాల ద్వారా ఆధ్యాత్మిక శాంతి కలగడంతో పాటు సమాజంలో ఐక్యత, సద్భావన పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్, గోలి పూర్ణచందర్, కొత్తూరి ముకుందం, గట్టు రాంప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు.


