కాకతీయ, బయ్యారంః తమ మొక్కిన కోర్కెలను తీర్చినందుకు కోదండ రామాలయంలోని, హనుమంతుడి స్వామికి పంచలోహ గధను, బయ్యారం నకు చెందిన నంబూరి రామకృష్ణ, సరస్వతి దంపతులు గురువారం ఆలయ కమిటీ వారికి అందించారు. ఈ సందర్భంగా రామాలయ అర్చకులు సుదర్శన చార్యులు గధ బహూకరణ దాతలకు, ఆలయ సాంప్రదాయ ప్రకారం ఆ కుటుంబ సభ్యులకు పూజలు నిర్వహించి, వారిని ఘనంగా ఆహ్వానం పలికి, గధను హనుమంతుని స్వామికి బహుకరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ గాధె కృష్ణారెడ్డి, ఇతర సభ్యులు కొల్ల వెంకటేశ్వరావు, వైయస్ ,చంద్రా రెడ్డి, నంబూరు మధు ఎల్లావుల మల్లయ్య, వేమిశెట్టి కోటి పుట్టగుంట సత్తిబాబు నంబూరి వెంకట పిచ్చయ్య, పెద్దిన్ని వెంకటేశ్వరరావు ,సోమిరెడ్డి, బుచ్చయ్య, పాండవుల లింగయ్య, తిరుపతి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.


