epaper
Thursday, January 15, 2026
epaper

తిండి అగ్గువే! తొండే ఎక్కువ!!

తిండి అగ్గువే! తొండే ఎక్కువ!!
అన్నం పథకంలో అవకతవకలు
రూ.5ల భోజనంలో అక్రమాలు
పేరుకే తక్కువ రేటు.. ప్లేటుకు రూ.29.50 బల్దియా చెల్లింపు వరంగల్ నగరంలో 11 చోట్ల వడ్డింపు.
లెక్కకు మించి సరఫరా చేస్తున్నట్లు లెక్కలు
నెలనెలా లక్షల్లో ప్రజాధనానికి గండి
పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్ల దోపిడీ

కాకతీయ, వరంగల్: అరాణా దావత్కు బారాణా రిక్షా కిరాయి అంటే ఇదేనేమో.. మనకు తెలియకుండానే పార్టీలకు ఖర్చు పెడుతుంటాం. ఇదే కోవలో ప్రజలకు తెలియకుండానే వరంగల్ గ్రేటర్ బల్దియా ఓ భోజన పథకానికి నెలనెలా లక్షల్లో డబ్బు వెచ్చిస్తోంది. అయితే, అందులో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలకవర్గం కీలకనేతలు, సీనియర్ మోస్ట్ అధికారులు, కాంట్రాక్టర్ మూకుమ్మడిగా దానం పేరిట ధనదాహం తీర్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు రూ.5, కొసరు కోట్లు!
వరంగల్ మహానగరంలో 2017లో అన్నదాన పథకం ప్రారంభమైంది. నిరుపేదలు, అభాగ్యులు ఆకలి తీర్చే లక్ష్యంతో రూ.5కే నాణ్యమైన భోజనం అందించాలని బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. నగరంలో 11 చోట్ల ఈ భోజన వడ్డింపు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదీ ప్రజలకు తెలిసిన విషయం. అసలు సంగతి… ఈ పథకానికి నిరుపేద బోజన దారుల నుండి ప్లేటుకొక్కంటికి రూ. 5లు వసూలు చేసి బల్దియాకు చెల్లిస్తారు. అందుకు బల్దియా ప్లేటు మీర్సు రూ.29.50 చెల్లిస్తూ వస్తోంది. అగ్గువ పేరిట అందిస్తున్న భోజనం అసలు ఖరీదు రూ.24.50 మార్కెట్లో రేటును బట్టి చూస్తే ఇది తక్కువే. ఇక ఒప్పందం ప్రకారం.. మెనూలో పేర్కొన్నట్లు రూ.5కు 400గ్రాముల అన్నం, ఒక కర్రీ, సాంబారు, ఒక పచ్చడి వడ్డించాల్సి ఉంది. కానీ, ఈ నిబంధనలు పాటించడంలో కాంట్రాక్టర్ చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇక భోజనం లెక్కల్లోనూ పెద్దసంఖ్యలో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. భోజనం అందించకపోయినా ఎక్కువ ప్లేట్లు లెక్కలు రాసి ఆ డబ్బులు బల్దియా పాలకవర్గానికి చెందిన బడా నేత, ఓ కీలక అధికారి, కాంట్రాక్టర్ నెలనెలా పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో మొత్తం కోటి అరవై లక్షల ప్లేట్ల భోజనం అందించగా, రూ.5కోట్ల మేర బల్దియా చెల్లించినట్లు రికార్డులు వెల్లడిస్తుండగా, వాస్తవ లెక్కలు అందుకు భిన్నంగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, లిస్టులో పేర్కొన్నట్లుగా అన్ని చోట్ల భోజనం వడ్డించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయినా, నెలనెలా లెక్కల్లో మాత్రం భోజనం అందించినట్లు చూపించి లక్షల్లో ప్రజాధనం కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది.

        

అన్నదానం పేరిట..
ఇక బల్దియా అధికారులు గాని, ప్రైవేటు బడా మహారాజులు గాని తమ పుట్టిన రోజులకో, తమ కుటుంబ సభ్యుల పుట్టిన రోజులకో అన్నదానం పేరుతో అప్పుడప్పుడు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని సమయాల్లో పిహెచ్ వర్కర్లకు ఆ భోజనం కూడా ఈ రూ.5భోజనంతో సరిపెడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం రూ. 5లతో అటు సిబ్బంది వద్ద పేరుకు పేరు. ఇటు బల్దియా సొమ్ముతో ఉచితంగా భోజనం కొట్టేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img