రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు
* ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
* ధర్నా కు వెళ్లకుండా ఆశా వర్కర్లను అరెస్ట్ చేసిన పోలీస్ లు
కాకతీయ,చేర్యాల: ఆశా కార్యకర్తలను చేర్యాల పోలీసులు ముదస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లకుండ శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ లు చేయడం అమానుషమని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లలో పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.మా సమస్యలు పరిష్కరించకునేంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. కనీస వేతనం అందజేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. తక్కువ పారితోషికంతో ఎక్కువ పని చేయించుకోవడం అన్యాయమని, ఆశ వర్కర్లకు తక్షణమే గౌరవప్రదమైన కనీస వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయినా వారిలో సార్ల కవిత, విజయ, కావేరి, మంజుల, నాగలక్ష్మి, జ్యోతి, నాగమణి, కవిత, లత, సరళ, హైమావతి,పద్మ, భారతి,బాలమణి,రమాదేవి, శిరీష, రాంబాయి, కరుణ, యాదమ్మ, నవనీత, అనిత తో పాటు తదితరులు ఉన్నారు.


