కాకతీయ,నర్సింహులపేట : మండల విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని బొజ్జన్నపేట గ్రామంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ పాండు మాట్లాడుతూ రైతులకు విద్యుత్ ప్రమాదాలు, భద్రతల గురించి వివరించారు. పంట పొలాల వద్ద ప్రమాదకరంగా ఉన్న లైన్లు తెగిపడినా, ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజులు పోయినా సొంతంగా మరమ్మతులు చేయడం ప్రమాదకరమన్నారు. సమస్యలపై దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం సహకరించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో లైన్ఇన్స్పెక్టర్ కిషన్, లైన్ మెన్ చలమయ్య సిబ్బంది శ్రీను, సుధాకర్, వెంకన్న, రైతులు పాల్గొన్నారు.


