కాకతీయ, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పకీర తండా గ్రామపంచాయతీ బుడ్డితండా గ్రామంలో విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఈ పాండు మాట్లాడుతూ రైతులకు విద్యుత్ ప్రమాదాలు, భద్రతల గురించి వివరించారు. పంట పొలాల వద్ద ప్రమాదకరంగా ఉన్న లైన్లు, వైరు తెగిపడినా, ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజులు పోయినా విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలిగినా వెంటనే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుని మరమ్మతులు చేస్తారన్నారు. రైతులెవ్వరూ మరమ్మతులు చేయవద్దని, అది ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంఓ లైన్ ఇన్స్పెక్టర్ కిషన్, సిబ్బంది సుధాకర్, వెంకన్న, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


