- హుజురాబాద్ బీసీ జేఏసీ డిమాండ్
- ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలంటూ కమిషనర్‌కు వినతి పత్రం
కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్‌లో ప్రతిపాదిత వేస్ట్ బేస్డ్ డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని తక్షణమే రద్దు చేయాలని బీసీ జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు గురువారం వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ టెండర్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఈ యార్డ్ నిర్మాణం ప్రారంభమవుతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ వలన హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్, సందేల వెంకన్న తెలిపారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇటువంటి డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, సంబంధిత అధికారులకు తగు సిఫార్సు చేసి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.కార్యక్రమంలో బీసీ జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు ఆకుల సదానందం, కొలిపాక శంకర్, ఇప్పకాయల సాగర్, చిలుకమారి శ్రీనివాస్, తాటిపాముల కనకయ్య, రామ్ సారయ్య, మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, గౌరీశెట్టి సాంబయ్య, దొంత హరికిషన్, వేల్పుల రత్నం, పెద్దపేట రమేష్, మండల వీరస్వామి, భారత ప్రభాకర్, దాసరి మల్లేశం, గోస్కుల మధుకర్, గరవేణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.03


