epaper
Saturday, November 15, 2025
epaper

42 శాతం రిజర్వేషన్ల డ్రామా

42 శాతం రిజర్వేషన్ల డ్రామా..

లిల్లీపుట్ ముఖ్యమంత్రికి పాలన తెలియదు..

ప్రజల్లో వ్యతిరేకత తట్టుకోలేక కొత్త డ్రామా..

22 నెలల్లో బీసీలకు ఏం చేశారు..?

బీసీలను ఆర్థికంగా నష్ట పరచడమే కాంగ్రెస్ ధ్యేయం..

గ్రామాలు వెనకబడి పోయాయి..

తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌ రావు..

కాకతీయ, వరంగల్ బ్యూరో : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ లోనీ ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంయుక్తంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. దున్నపోతు మీద నీళ్లు పడితే ఎలా ఉంటదో రేవంత్ రెడ్డి తీరు అలా ఉంది. పార్టీ పరంగా ఒక మాట, ప్రజల ముందు ఇంకో మాట. యావత్ దేశంలోనే జోకర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోయింది. అని వ్యాఖ్యానించారు. అతను మరో మాటలో, డిల్లీ అధిష్ఠానం కూడా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే యాభై సార్లు డిల్లీ వెళ్లినా కలవకుండా తిరిగి పంపించారట. ప్రజలు కూడా ఈ ప్రభుత్వంపై బగ్గుమంటూ మండిపోతున్నారు. 22 నెలల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారు, అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరో ఇద్దరు రెడ్డి నేతలు సీఎం కుర్చీ కోసం సిద్ధంగా ఉన్నారు. వారు కూడా ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ 420 హామీల పార్టీ ఎలాగో.. ఈ 42 శాతం రిజర్వేషన్ల డ్రామా కూడా అలాగే..

కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల పార్టీ ఎలాగో, ఈ 42 శాతం రిజర్వేషన్ల డ్రామా కూడా అలాగే అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. లిల్లీపుట్ ముఖ్యమంత్రికి పాలన, చట్టాలపై అవగాహన ఏమీ లేదు. దేశంలో ఏ సీఎం సాధించని ఘనత, విమానం ఎక్కి దిగడంలో మాత్రం తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సాధించారు. అని ఎద్దేవా చేశారు. కోర్టును గౌరవించకుండా పొద్దుగాల నామినేషన్లు తీసుకుని సాయంత్రానికి నవ్వుల పాలయ్యారు. హైకోర్టు గూబ గుయ్యిమనిపించింది. రాష్ట్రంలో మంత్రులు కూడా కుర్చీ కోల్పోతామనే భయంతో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అని అన్నారు.

ప్రజల్లో వ్యతిరేకత తట్టుకోలేక కొత్త డ్రామా..

ప్రజల్లో వ్యతిరేకతను తట్టుకోలేక ఈ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలు పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకనే కోర్టు ఆపిందని చెప్పి బాధ్యత తప్పించుకుంటున్నారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీల గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? ఇప్పుడు తూటూతూ మంత్రంగా జీఓ ఇచ్చి మభ్యపెడుతున్నారు. నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే కేంద్రంతో రిజర్వేషన్ల కోసం పోరాడండి. మేమంతా మీతో వస్తాం. అని సవాలు విసిరారు.

22 నెలల్లో బీసీలకు ఏం చేశారు..?

బీసీ బంధు బంద్, చేప పిల్లల పంపిణీ బంద్, నాయి బ్రాహ్మణ, రజకుల విద్యుత్ బకాయిలు పెండింగ్, గొల్లకురుమల గొర్రెల పథకం నిలిచిపోయింది. బీసీల మీద ప్రేమ ఉందంటూ నాటకం ఆడుతున్నారు. అని ఎర్రబెల్లి దయాకర్‌ రావు విమర్శించారు. గవర్నర్ ఆమోదం లేకుండానే 42 శాతం బిల్లుతో ఎన్నికలకు వెళ్లడం తెలివి తక్కువ పని. ఇదే కారణంగా బీహార్‌లో ఎన్నికలు ఆగిపోయాయి, మహారాష్ట్రలో రద్దు అయ్యాయి. ఈ ప్రభుత్వానికి అంత అవగాహన లేదా? అని ప్రశ్నించారు.

బీసీలను ఆర్థికంగా నష్ట పరచడమే కాంగ్రెస్ ధ్యేయం..

ఈ చట్టం నిలబడదని ఈ ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా బీసీలను మభ్యపెట్టడానికే ఈ నాటకం. అభివృద్ధి చేయలేక ఆర్టీసీని అమ్మే కుట్ర చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు అంటూ అప్పులు చేసి, చార్జీలు పెంచి మగవారిపై భారం వేస్తున్నారు. అని ఆయన అన్నారు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. ఇంకా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ప్రజల సహనం ఉరికించి కొడుతుంది. అని హెచ్చరించారు.

గ్రామాలు వెనకబడి పోయాయి..

గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను వెనకబడి పోయేలా చేసింది. కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చి వాటిని బలపరిచారు. కానీ ఈ ప్రభుత్వం గ్రామాలను ఆధ్వాన్న స్థితికి నెట్టేసింది. అని విమర్శించారు. ముందుగా 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురండి. బీసీలకు మేమంతా అండగా ఉంటాం. అని తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img