గ్రామాల అభివృద్ధే మా ప్రభుత్వ ప్రాధాన్యం
ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ
కాకతీయ, కరీంనగర్ : గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్, రామకృష్ణ కాలనీలలో సర్పంచ్ అభ్యర్థులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో మహాత్మానగర్ సర్పంచ్ అభ్యర్థి భైరి చంద్రమౌళి, రామకృష్ణ కాలనీ సర్పంచ్ అభ్యర్థి దావు సుజాత–సంపత్ రెడ్డి, 8వ వార్డు అభ్యర్థి మాచర్ల అంజయ్య, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కుంట రాజేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు అలువాల కుమార్, కాంగ్రెస్ నాయకులు కేతిరెడ్డి ఎల్లారెడ్డి, దుర్గాప్రసాద్, గూడ కమలాకర్, ఈగ లింగయ్య, అంకూసు, సోమయ్య అశోక్, కేతిరెడ్డి ప్రభాకర్, లింగారెడ్డి, బి.శ్రావణ్, చందా చంద్రశేఖర్, సుధాకర్, ప్రభాకర్ రాజు, రజనీ, రమ, బూతం అనిల్, తూర్పాటి శ్రీనివాస్, రామారావు తదితరులు పాల్గొన్నారు.


