- బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
కాకతీయ, పెద్దవంగర : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్లి వారికీ నిజాలు తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కోరిపల్లిలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆరుట్ల వెంకన్న అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన బాకి కార్డులను పంపిణీ చేయాలని కోరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ ఎస్ విజయం దిశగా కలసికట్టుగా పని చేయాలని ఆయన కోరారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి శ్రీరాం సంజయ్, ఉపాధ్యక్షుడు వెంకన్న, నాయకులు శ్రీరాం సుధీర్, జాన్జేశ్వర చారి, శోభప్రసాద్, భీమానాయక్ , ముజిబుద్దీన్, ఎర్ర వెంకన్న, తదితరులు పాల్గొన్నారు..


