బీసీ బిడ్డ మృతి బాధాకరం
బీసీ ఆజాదీ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే అణచివేతలకు కారణం
బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్
పోరాటం ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం
కాకతీయ కరీంనగర్ : రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న అణచివేతలు, అరాచకాలు, ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయంటూ బీసీ ఆజాదీ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటనకు మరువకముందే, క్యూ న్యూస్ కార్యాలయం ఎదుట సాయి ఈశ్వర చారి ఆత్మహత్యాయత్నం చేసి చివరకు మృతి చెందడం కలచివేసిందన్నారు.ఈ ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని భాస్కర్ మండిపడ్డారు. బీసీల పట్ల ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలను ఘోరంగా మోసం చేశారని విమర్శించారు.బీసీలు ఐక్యంగా నిలబడితే మాత్రమే హక్కులు సాధ్యమవుతాయని, తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎవరు కూడా ఆత్మహత్యల దారి పట్టకూడదని, రిజర్వేషన్లు సాధించి బీసీల కలలను నిజం చేసుకుందామని భాస్కర్ పిలుపునిచ్చారు.


