epaper
Saturday, March 28, 2026
epaper

నేత్రపర్వంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

నేత్రపర్వంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

రామనామ స్మరణలతో మార్మోగిన మిథిలా ప్రాంగణం

పట్టువస్తాలను సమర్పించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల

ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరి మార్ట్ ప్రారంభం

కాకతీయ, కొత్తగూడెం:దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మిధిలా ప్రాంగణంలో శనివారం అత్యంత వైభవంగా జరిగిన ఈ మహోత్సవంలో దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల మహోత్సవానికి హాజరై స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ఆశీస్సులు పొందారు. మహోత్సవాన్ని ఆధ్యంతం తిలకిస్తూ భక్తి పరవశంలో పాల్గొన్నారు.
పట్టాభిషేక వేడుకలు సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగాఅర్చకులవేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. తొలుత రామాలయంలో భద్రుని మండపంలో స్వామివారి పాదుకలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం గౌతమీ నదీ తీరంనుంచి పవిత్ర తీర్థములను తీసుకువచ్చి రాజ లాంఛనాలతో మిధిలా ప్రాంగణానికి ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చారు. భాజా భజంత్రీల నాదాలు, సన్నాయి మేళాలు, భక్తుల కోలాటాలతో ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

కళ్యాణ మండపంలో స్వామివారు ఆశీనులైన అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. తరువాత పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణాలతో స్వామివారికి రాజలాంఛనాలు అలంకరించి పట్టాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద పారాయణాలతో పాటు విష్ణు పురాణం, భగవత్ శాస్త్ర పారాయణాలు జరిగాయి. పుష్కర జలాలతో మహాకుంభ తీర్థప్రోక్షణ నిర్వహించగా, అనంతరం హారతులు సమర్పించారు.పట్టాభిషేక వేడుకల సందర్భంగా మిధిలా ప్రాంగణం మొత్తం శ్రీరామ నామ స్మరణలతో మార్మోగింది. కార్యక్రమం అనంతరం భక్తులపై పుణ్య నదీ జలాలను చల్లి ఆశీర్వదించారు.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం వంటి ప్రధాన వేడుకలకు హాజరైన భక్తులు తీపి జ్ఞాపకాలతో వెనుదిరిగారు. పట్టాభిషేకానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పూల బొకేలు అందించి సాధరంగ ఆహ్వానించారు .ఈ మహోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఐటీడీఏ పీఓ రాహుల్, దేవస్థానం ఈవో దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

భద్రాచలం ఆలయ అభివృద్ధి రామభక్తుల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.350 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు. భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరి మార్ట్‌ను గవర్నర్ సతీసమేతంగా ప్రారంభించారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధి, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం లక్ష్యంగా ఈ గిరి మార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అడవి ఉత్పత్తులు, సేంద్రీయ ఆహార పదార్థాలు, గిరిజన హస్తకళా వస్తువులను ఒకే వేదికపై విక్రయానికి అందుబాటులో ఉంచడం ద్వారా గిరిజనులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.గిరి మార్ట్ ప్రారంభానంతరం అక్కడ అమ్మకానికి ఉంచిన గిరిజన ఉత్పత్తులను గవర్నర్ సతీసమేతంగా పరిశీలించి, వాటి ప్రత్యేకతలు, తయారీ విధానం, మార్కెటింగ్ సదుపాయాల గురించి జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.
గవర్నర్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించారు. మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేసిన కార్మికులు అసెంబ్లీలో...

రాజీ మార్గమే రాజ మార్గం..

రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో...

కుమారుడితో కలిసి గోదావరి లో దూకిన మహిళ

కుమారుడితో కలిసి గోదావరిలో దూకిన మహిళ తల్లీ,కొడుకు లను కాపాడిన స్థానిక యువకులు...

మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి

మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి భగత్ సింగ్ స్ఫూర్తితో ఐక్య పోరాటం పీవైఎల్, పిడిఎస్‌యూ,...

ట్రాఫిక్ నియమాలు పాటించండి – సురక్షితంగా గమ్యం చేరండి

ట్రాఫిక్ నియమాలు పాటించండి - సురక్షితంగా గమ్యం చేరండి *వైరా ఏసీపీ కాకతీయ, ఖమ్మం...

రాజీ మార్గమే రాజమార్గం

రాజీ మార్గమే రాజమార్గం కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సువర్ణావకాశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు

ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఆన్లైన్ లో ట్రేడింగ్,...

కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు..

కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు.. ఆర్ఐ , సర్వేయర్ ల అవినీతిపై నిగ్గు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img