తోటి తాపీమేస్త్రి మృతి ఆర్థిక సహాయంతో అండగా నిలిచిన సంఘం…
నాగెల్లి పుల్లయ్య కుటుంబానికి రూ.30వేల సాయం అందించిన భవన నిర్మాణ కార్మిక సంఘం…
అండగా నిలుస్తున్న సంఘాలు.. అభినందిస్తున్న ప్రజలు…
కాకతీయ,ఖానాపురం: తమతో కలిసి మెలిసి పనిచేసిన తాపీమేస్త్రి, కార్మిక సంఘం నాయకుడు నాగెల్లి పుల్లయ్య హఠాత్మమరణంతో కంగుతిన్న కుటుంబానికి ఖానాపురం భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు వంచె శ్రీనివాస్ రెడ్డి, సంఘం నాయకులు షేక్ మైనోద్దీన్, దేవాండ్ల వెంకటేష్, మేడిద కుమార్ ఆధ్వర్యంలో సేకరించిన 30 వేల రూపాయల నగదును మృతుడి కుమారులు నాగెల్లి అనిల్, మధు కు అందించారు. ఈ సందర్భంగా కష్టకాలంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన ఖానాపురం భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యుల దాతృత్వానికి గ్రామ ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక సంఘంలో ఎవరికైనా ఆపద వస్తే వెంటనే స్పందించి తమకు తోచినంత సహాయం అందించి కుటుంబానికి అండగా నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తరాల శ్రీనివాస్, తూనం నాగరాజు, గుండ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్, గూడ సారంగం, వెంకన్న, మల్యాల నరసింహ, మేడిపల్లి రంజిత్, పాలకుర్తి శివ, సానాది నాగరాజ్, నీలం శోభన్, పందుల శ్రీనివాస్, పీసరి స్వామి, నాగేల్లి రాజశేఖర్, మహేందర్, దేవాండ్ల వెంకట్రాం, చలువాది వెంకటేష్,మై పాషా తదితరులు పాల్గొన్నారు.


