కాకతీయ, నర్సంపేట: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రం, లక్నెపల్లి గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ ప పాఠశాలలో ఏర్పాటుచేసిన మూడు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని కలెక్టర్ పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి, డిపిఓ కల్పన, ఆర్డీఓ ఉమారాణి ఎంపీడీవోలు శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.


