- తప్పిన పెనుప్రమాదం
కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్‌లోని పడమర కోట నుంచి మధ్యకోటకు వెళ్లే దారిలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్ద బండరాళ్లు కూలి రోడ్డుపై పడిపోయాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ ఆ మార్గంలో వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కోట గోడలు చాలా కాలంగా దెబ్బతిన్నా కూడా ఆర్కియాలజీ విభాగం ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టలేదని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యంతో చారిత్రక కోట ధ్వంసమై, ప్రజలకు సైతం ప్రమాదకరంగా మారుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ముళ్ల చెట్లను తొలగించి పరిరక్షించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కోట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. పురావస్తు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


