epaper
Monday, March 2, 2026
epaper

హిందూ వ్యతిరేకిగా మారిన సీఎం

హిందూ వ్యతిరేకిగా మారిన సీఎం
హిందు మ‌తంపై విమ‌ర్శ‌లు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు !?
రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కాకతీయ, కరీంనగర్ : హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బుధవారం బీజేపీ జిల్లా శాఖ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇతర మతాల మెప్పుకోసం హిందూ దేవుళ్లను హేళనగా ప్రస్తావించారని విమర్శించారు. మూడు కోట్ల దేవతలను లక్ష్యంగా చేసుకుని సీఎం చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ “హిందుగాళ్లు – బొందుగాళ్లు” అన్న వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా సమాజం కఠినమైన తీర్పు ఇచ్చిందని, నేడు ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే స్థితికి చేరిందని గుర్తుచేశారు. అదే బాటలో సీఎం రేవంత్ కూడా నడుస్తున్నారని, హిందూ సమాజంతో విభేదాలు పెంచుకుంటే కేసీఆర్ లాంటి పరిస్థితి తప్పదని హెచ్చరించారు.హిందూ దేవుళ్ల గురించి మాట్లాడే ధైర్యం చూపిన సీఎం, అదే స్థాయిలో ఇతర మతాల దేవుళ్ల గురించి మాట్లాడగలరా? అంటూ గంగాడి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. హిందూ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమానికి ముందు కొత్తపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కూడా గంగాడి కృష్ణారెడ్డి ఇదే ఆరోపణలు పునరుద్ఘాటించారు.కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, వాసాల రమేష్, కళ్లెం వాసుదేవరెడ్డి, గువ్వల శ్రీనివాస్, కటకం లోకేష్, పాదం శివరాజ్, బండారు గాయత్రి, తణుకు సాయి కృష్ణ, అవదుర్తి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి, ఆవిడల చైతన్య, నాంపల్లి శ్రీనివాస్, ప్రసన్న, యువ క్రాంతి, అక్షయ్, కట్ట రాజు, ప్రసాద్, బోయిన్ శ్రీను, జి.రవి, అనిష్, పాశం తిరుపతి, ఆకుల నరేష్, అజయ్, వెంకటేష్, సందీప్, శ్రీధర్, అనిల్, విజయ్, కలికోట మోహన్, నారాయణ, జిత్తు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img