epaper
Saturday, November 15, 2025
epaper

లంబాడీల షెడ్యూల్డ్ తెగల హోదా తొలగింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి..!!

కాకతీయ, మహబూబాబాద్ టౌన్: ఆదివాసీ పోరాట సమితి – తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం మహబూబాబాద్ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నిర్వహించడం శుక్రవారం జరిగినదని తెలిపారు .

ఈ సమావేశం కబ్బాక శ్రావణ్ కుమార్ తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరుగగా వట్టం ఉపేందర్ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు, రమణాల లక్ష్మయ్య తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్, పొడుగు శ్రీనాథ్ తుడుందెబ్బ రాష్ట్ర సలహాదారులు, పోడెం రత్నం, యాసం రాజు తుడుందెబ్బ జాతీయ కో- కన్వీనర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ,ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్రంలో గిరిజన తెగల సామాజిక న్యాయం కోసం ఏర్పాటు జరిగిందని గుర్తు చేస్తూ, లంబాడీల షెడ్యూల్డ్ తెగల హోదా తొలగింపు సుప్రీం కోర్టులో కేసు ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెగలలలో సామాజిక న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెగల కమిషన్ ఏర్పాటు చేసి ఏ తెగ రిజర్వేషన్, విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఎంత అభివృద్ధి జరిగిందని గిరిజన తెగల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ తెగల అభివృద్ధి జరగాలంటే తెగల కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని కోరారు. రాష్ట్రంలో 35 తెగలు జీవిస్తున్నాయి. ఈ తెగలలో అభివృద్ధి పరంగా వెనుకంజలో ఉన్న తెగలు ఉన్నాయి. ఇప్పటివరకు రిజర్వేషన్ పరంగా విద్యా ఉద్యోగ సంక్షేమ ఆర్థిక రంగాలలో ఒక్క శాతం కూడా అనుభవించని వారున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతంలో స్థానిక ఉద్యోగ భద్రత కల్పిస్తూ కొత్త రెగ్యులేషన్ రూల్స్ రూపొందించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అక్రమ గిరిజనేతరుల వలసలను అరికట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతర అభివృద్ధి పేరుతో ఆదివాసి తెగల సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మొదలగు మతాల అనుకూలమైన నమూనాలు ఏర్పాటు చేయటానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం విరమించుకోవాలి. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నమూనా తయారుచేసి జాతర అభివృద్ధి చేయాలని తెలిపారు. సమ్మక్క, సారులమ్మ ,పడిగిద్ద రాజు,గోవిందరాజుల చరిత్ర వక్రీకరణ జరిగే విధంగా గద్దెల ప్రాంగణాలను ఆధునీకరణ చేయడం సరి కాదని తెలిపారు. ఇది ఎన్నో సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ప్రాంగణం. వనదేవతల ప్రాణ ప్రతిష్ట ఒక రహస్యమైనటువంటిది. దీనిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని ఆదివాసి హక్కుల పోరాట సమితి తీవ్రంగా హెచ్చరిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకుడు గంజి రాజన్న, గంట సత్యం, వట్టం కన్నయ్య, మల్లెల రాము, దనసరి రామ్మూర్తి తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు, చింత కృష్ణ,పూనమ్ శ్రీను తుడుందెబ్బ కార్యదర్శులు, పాయం జానకి రమణ, మడకం చిట్టిబాబు తుడుందెబ్బ రాసిన నాయకులు, కొమరం లక్ష్మీకాంత ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి, సువర్ణపాక వెంకటరత్నం తుడుందెబ్బ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, వట్టం జనార్దన్, చందా మహేష్ ములుగు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, దుగ్గారపు వీరభద్రం, చీమల వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వివిధ జిల్లాల ముఖ్య నాయకులు,మండల నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img