కాకతీయ, ఆత్మకూర్ : ఆత్మకూర్ శివారులో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గుడుంబాను పట్టుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రాజరాజేశ్వర హోటల్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి.నర్సింహారావు, సిబ్బంది జె.శ్రీనివాస్, కె.శ్రీనివాస్, స్వాతిలు అనుమానాస్పదంగా బైక్ పై వెళ్తున్న వారిని ఆపి తనిఖీ చేశారు. బైక్‌పై ఉన్న శారద, తిరుపతి వద్ద 21 ప్యాకెట్లలో 42 లీటర్ల గుడుంబా లభించింది. దీని విలువ సుమారు రూ.8,400 ఉంటుందని గుర్తించారు. గుడుంబా విక్రయానికి ప్రభుత్వ అనుమతులు లేవని విచారణలో తేలింది. గుడుంబా శాంపిల్ తీసుకుని, మిగిలిన వాటిని, బైక్‌ను సీజ్ చేసి, నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి ఎస్ హెచ్ఓకు అప్పగించారు.


