epaper
Tuesday, January 27, 2026
epaper

క్యాడ‌ర్ ఓకే.. నేత‌లే క‌రెక్ట్ లేరు

క్యాడ‌ర్ ఓకే.. నేత‌లే క‌రెక్ట్ లేరు
వ‌రంగ‌ల్‌లో బీజేపీకి అత్తెస‌రు నాయ‌క‌త్వం..
హ‌న్మ‌కొండ‌లో ఆయ‌న పేరుకే పెబ్బ‌.. పెత్త‌నమంతా ఇంకా ఆమెదే..!
కొత్త‌వాళ్ల‌ను ఆహ్వానించ‌రు.. పాత త‌రాన్ని గుర్తించ‌రు..!
అంతా మేమే.. అంతా తామే అన్న‌ట్లుగా రాజ‌కీయ వ్య‌వ‌హార శైలి
సీనియ‌ర్ నేత‌ల్లో పెరుగుతున్న అస‌హ‌నం..!
మ‌రి రాష్ట్ర నాయ‌క‌త్వం గుర్తించేది ఎప్పుడు..?!
ఇలా అయితే వ‌రంగ‌ల్‌లో పార్టీ ఎదిగేదెప్పుడు..?
క్యాడ‌ర్‌లో లోక‌ల్ నాయ‌క‌త్వంపై గుస్సా..!

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వరంగల్, హ‌న్మ‌కొండ‌ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, క్షేత్రస్థాయిలో క్యాడర్ బలంగా ఉన్నా, నాయకత్వ లోపాలు మరియు అంతర్గత విభేదాలు పార్టీని వెనక్కి లాగుతున్నాయి. సమన్వయం లేని నేతల రాజకీయంతో కార్యకర్తల్లో తీవ్ర అసహనం పెరుగుతోంది. వరంగల్, హన్మకొండ నియోజకవర్గాల్లో కొందరు నేతల ఆధిపత్యం ఎక్కువగా ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. “పేరుకే ఒకరు.. పెత్తనమంతా మరొకరిది” అన్న తరహా రాజకీయ వ్యవహార శైలిపై సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హ‌న్మ‌కొండ జిల్లా పార్టీలో ఇంకా ఆమె చేతుల్లోనే పార్టీ పెత్త‌న‌మంతా ఉందంటూ కామెంట్లు వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. పేరుకే ఆయ‌న పెబ్బ‌.. పెత్త‌న‌మంతా ఇంకా ఆమెదే అంటూ కొంత‌మంది సీనియ‌ర్ లీడ‌ర్లు న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం గ‌మనార్హం. నిర్ణయాలు కొద్దిమంది చేతుల్లోనే ఉంటుండటంతో మిగతా నేతలకు క‌నీస ప్రాధాన్యం ఉండ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆరూరి నిష్క్రమణతో..

బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు జిల్లాలో స‌ముచిత స్థానం క‌ల్పించ‌డంలో లోక‌ల్ నాయ‌క‌త్వం వైఫ‌ల్యం చెందింద‌న్న చ‌ర్చ ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో జ‌రుగుతోంది. రాజ‌కీయాల్లో సొంత ఎజెండా ఉండ‌టం స‌హాజం.. అరూరి ర‌మేష్ కూడా అందుకు భిన్నంగామీ వ్య‌వ‌హ‌రించ‌లేదు. కానీ పార్టీ ఫ‌స్ట్‌..ప‌ర్స‌న్ నెక్ట్స్ అన్న బీజేపీ మూల సూత్రాన్ని గుర్తు చేస్తూనే.. కొంత‌మంది లీడ‌ర్ల‌కే ప్రాధాన్యం ఏంట‌ని..! పార్టీలో తాము త‌ప్పా మిగిలిన వారంతా కూడా తాము చెప్పిన‌ట్లుగానే న‌డుచుకోవాల‌నే పెత్తందారి వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించ‌డంపై ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్ర నేత‌లు జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డ తామే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారు.. ఎన్నిక‌ల్లో త‌మ డివిజ‌న్ల‌లో కూడా క‌నీస ఓట్లు సాధించ‌లేక‌పోయారంటూ మండిప‌డుతున్నారు. అరూరి ఫ‌క్తు రాజ‌కీయ నేత‌గా వ్య‌వ‌హ‌రించార‌ని కొంత‌మంది బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తుండ‌గా.. చేసేదే రాజ‌కీయం.. పార్టీకి ప‌ర్స‌న్స్ కూడా ముఖ్య‌మే క‌దా అంటూ మ‌రికొంత‌మంది లీడ‌ర్లు ఇప్పుడు గ‌ట్టి వాద‌న వినిపిస్తున్నారు. పార్టీలో కొత్త‌గా ఎవ‌రొచ్చినా త‌మ‌కు పోటీ అన్న‌ట్లుగా ఓ న‌లుగురైదుగురు లీడ‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. జిల్లాలో పార్టీ ఎదుగుద‌ల‌కే ఆటంకంగా మారింద‌న్న విమ‌ర్శ‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. పార్టీలో అరూరిని కీల‌కం చేయ‌డంలో స్థానిక నాయ‌క‌త్వం ఆయ‌న్ను పోటీగా భావించ‌ద‌న్న చ‌ర్చా జ‌రుగుతోంది. ఆయన నిష్క్రమణ పార్టీకి రాజకీయంగా గట్టి దెబ్బగా మారింద‌ని, ఆరూరితో పాటు మరికొందరు నేతలు కూడా బయటకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం క్యాడర్‌లో ఆందోళన క‌లిగిస్తోంది.

పాత–కొత్త మధ్య పెరుగుతున్న గ్యాప్

పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి సరైన ఆహ్వానం లేదని, అదే సమయంలో పాత తరం నేతలను గుర్తించట్లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల నియామకాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుండటంతో సీనియర్ నేతల్లో అసహనం మరింత పెరుగుతోంది. ‘అంతా మేమే.. అంతా తామే’ అన్నట్టుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని పార్టీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది.
క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు స్థానిక నాయకత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప పార్టీ విస్తరణపై దృష్టి లేదన్న అభిప్రాయం బలపడుతోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ప్రచార వ్యూహాలు స్పష్టంగా లేకపోవడం, నేతల మధ్య ఐక్యత కొర‌వ‌డ‌టం పార్టీకి నష్టం మిగిల్చే సంకేతంగానే క్యాడ‌ర్ భావిస్తోంది. మొత్తానికి, వరంగల్ లాంటి కీలక జిల్లాలో బీజేపీకి క్యాడర్ బలం ఉన్నా, నాయకత్వ వైఫల్యాలు పార్టీ ఎదుగుదలకు అడ్డుగా మారుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుండ‌టం పార్టీ విస్త‌ర‌ణ‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది. ఈ అంతర్గత కుమ్ములాటలను రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు గుర్తించి జోక్యం చేసుకుంటుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. లేదంటే… వరంగల్‌లో పార్టీ ఎదుగుదల ఎప్పుడన్న ప్రశ్న.. ఎప్ప‌టికీ ప్ర‌శ్న‌గానే ఉండిపోతుంద‌ని ఆవేద‌నతో కూడిన చ‌ర్చ బీజేపీ శ్రేణుల్లో జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పార్కుల్లో గ్రీనరీపై బల్దియా ఫోకస్

పార్కుల్లో గ్రీనరీపై బల్దియా ఫోకస్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మేయర్ సుధారాణి హార్టికల్చర్ అధికారులతో...

వ‌రంగ‌ల్ ప్రెస్ క్లబ్‌లో సంబరాలు

వ‌రంగ‌ల్ ప్రెస్ క్లబ్‌లో సంబరాలు డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పునరుద్ధరణపై హ‌ర్షం స్పష్టత ఇవ్వకపోతే...

మద్ది మేడారం జాతరపై పోలీసుల‌ సమీక్ష

మద్ది మేడారం జాతరపై పోలీసుల‌ సమీక్ష భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు బందోబస్తులో అలసత్వం...

చికిత్స పొందుతూ యువకుడు మృతి

చికిత్స పొందుతూ యువకుడు మృతి కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని...

న‌ల్ల‌మ‌టు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..?

న‌ల్ల‌మ‌టు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..? పదేపదే మత్తడి ధ్వంసం.. అధికారుల మౌనం చివరి ఆయకట్టుకు...

ఖిలా వ‌రంగ‌ల్ కోట‌లో ప‌ర్యాట‌కుల సంద‌డి

ఖిలా వ‌రంగ‌ల్ కోట‌లో ప‌ర్యాట‌కుల సంద‌డి మేడారం జాతరతో పెరిగిన ప‌ర్యాట‌కులు కాకతీయ, ఖిలావరంగల్...

ముత్యాలమ్మ జాతరకు ముహూర్తం

ముత్యాలమ్మ జాతరకు ముహూర్తం ఫిబ్రవరి 11న బోనాల పండుగ నిర్వహణ కాకతీయ, ఇనుగుర్తి :...

వరంగల్‌లో అరూరి ఎఫెక్ట్‌

వరంగల్‌లో అరూరి ఎఫెక్ట్‌ రమేష్ రీఎంట్రీతో రాజకీయ సమీకరణాల్లో మార్పు మున్సిపల్ ఎన్నికల ముంగిట...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img