కల్యాణ లక్ష్మితో పెళ్లి భారం తగ్గింది
చిన్ననాగారం గ్రామ సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో కల్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారునికి చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, ఉపసర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ చారి వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం పంజాల కవిత – దేవరాజు గౌడ్ దంపతులకు కల్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం కాకుండా ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందన్నారు. గ్రామస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నేత బైరు అశోక్ గౌడ్, కొయ్యడి యాకాంతం, బైరు శ్రీనివాస్, దాసరి ప్రకాష్‌తో పాటు వార్డు సభ్యులు బైరు వెంకన్న గౌడ్, మునిగంటి సరిత, రాజు చారి, ముత్యాల సోమక్క, నిడిగంటి చంద్రమౌళి పాల్గొన్నారు. అలాగే నాయకులు గుండాల ధర్మయ్య, నిడిగంటి బిక్షపతి, చెడుపాక దర్గయ్య, నాయిని కుమారస్వామి తదితరులు హాజరయ్యారు. గ్రామంలో సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు.


