బాలుడి మిస్సింగ్.. క్షణాల్లో చేదించిన ఎస్.ఐ
గంటల వ్యవధిలోనే కేసును చేదించిన ఖానాపురం ఎస్ఐ రఘుపతి..
అభినందించిన మండల ప్రజలు..
కాకతీయ, ఖానాపురం: ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులోని సైనిక్ స్కూల్ లో చదువుకుంటున్న భూక్య శశి గురువారం సాయంత్రం ఎవ్వరికి చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోవడంతో పిర్యాదు అందుకున్న ఖానాపురం ఎస్ఐ సిహెచ్. రఘుపతి ఆధ్వర్యంలో పోలీసులు క్షణాల్లో కేసును సేదించి బాలుడిని తిరిగి తల్లిదండ్రులకు శుక్రవారం అప్పగించారు. ఈ సందర్భంగా బాలుడు ఆచూకీ తెలుసుకొని త్వరగా కేసును చేదించినందుకు మండల ప్రజలు ఎస్.ఐ రఘుపతినీ అభినందించారు.


