కాకతీయ, కరీంనగర్ : అస్సాం రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఇంట్లో గొడవల కారణంగా అక్టోబర్ 31న ఇంటి నుంచి పారిపోయి వచ్చి కరీంనగర్ పట్టణానికి చేరాడు. చైల్డ్ హెల్ప్‌లైన్ (1098) ద్వారా సమాచారం అందుకున్న బాలల సంక్షేమ సమితి ( సిడబ్ల్యుసి), డీసీపీవో, కొత్తపల్లి పోలీస్‌లు కలిసి బాలుడిని రెస్క్యూ చేశారు. బాలుడిని ఓపెన్ షెల్టర్ హోంలో ఉంచి, అనంతరం బాలల సంక్షేమ సమితి ఆదేశాల మేరకు గురువారం తల్లితండ్రులకు అప్పగించారు. కార్యక్రమంలో సభ్యులు కలింగశేఖర్, రాధ, విజయ్, డీసీపీవో పర్వీన్, కోఆర్డినేటర్ సంపత్, కేస్‌వర్కర్ మహేష్, డీఈవో అనుష, కొత్తపల్లి పోలీసులు పాల్గొన్నారు.


