రేగుపండ్ల కోసం వెళ్లి బావిలో పడిన బాలుడు
మల్లారెడ్డిపల్లిలో విషాద ఘటన
కాకతీయ, జమ్మికుంట: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇరుణాల రాజు (12) అనే బాలుడు మంగళవారం స్నేహితులతో కలిసి రేగుపండ్ల కోసం వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బుధవారం ఉదయం బాలుడి మృతదేహం నీటిపై తేలడంతో స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


