కాకతీయ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయం శ్రీనివాస్ రెడ్డిపై గత నెల 21న పలువురు దాడి చేశారు. వారిని అరెస్టు చేయాలంటూ సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలే బోయిన వెంకటేశ్వర్లు, తొట్టి అశోక్, ఎల్ హెచ్ పీఎస్ నాయకులు భూక్యా రవి నాయక్, బీసీ సంఘం నేత గోవర్దన్, తుడుం దెబ్బ కుర్సం నరేష్, పలువురు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపైనే దాడులు చేయడం దుర్మార్గమని, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఎమ్మెల్యే నోరు మెదకపోవడం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, వారిని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే దోషులకు శిక్ష పడే వరకు విశ్రమించేది లేదని హెచ్చరించారు. జరుపుల శ్రీనివాస్, లాయర్ సుంకరి రజని, మండ రేణుక, కోడి అరుణ్, పర్షిక రాజు, వట్టం సాంబశివరావు, అలెం బిక్షం, గార్ల మండలం నుండి తాళ్లపల్లి కృష్ణ గౌడ్, బిజెపి మండల నాయకులు తుమ్మల శ్రీనివాస్, వన్నం రామారావు సంఘీభావం తెలిపారు.


