సిరిసిల్ల మున్సిపల్ అధికారుల లీలలు
అనుమతి పత్రాలు మావద్ద లేవు
లిఖిత పూర్వకంగా తెలిపిన మున్సిపల్ అధికారులు
ఆర్టిఏ సమాచారం తో బట్టబయలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలోని ఒక బంకెట్ హాల్‌కు సంబంధించిన అనుమతి పత్రాలు తమ వద్ద లేవని సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేశారు.సిరిసిల్ల పట్టణం లోని శివనగర్ లో గల బంకెట్ హాల్ నిర్వహణపై రగుడు గ్రామానికి చెందిన మహిపాల్ అనే యువకుడు హాల్ నిర్మాణం గురుంచి మున్సిపల్ కార్యాలయం లో ఆర్టిఏ ద్వారా సమాచారాన్ని కోరాడు. ఇట్టి ఆర్టిఏ కు స్పందించిన అధికారులు అనుమతి దరఖాస్తు, లైసెన్స్ రికార్డులు, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన పత్రాలు మావద్ద లేవని లిఖిత పూర్వకంగా తెలిపారు.
దీంతో బంకెట్ హాల్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మున్సిపల్ లోని టౌన్ ప్లానింగ్ అధికారులు కంచె చేను మేసినట్టు చందంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇట్టి అక్రమ నిర్మాణం పై సమగ్ర దర్యాప్తు చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని నిజాలు బయటకు తేవాలని కోరుతున్నారు.


