ఆదికవి వాల్మీకి మహర్షి
జిల్లా లో ఘనంగా వాల్మీకి జయంతి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా వారి మార్గంలో పయనించి అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించవచ్చు అనడానికి వాల్మీకి మహర్షి జీవితం నిదర్శనమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
కలెక్టరేట్లో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మామునూరు పోలీస్ క్యాంపు లో
వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వారి ధార్మిక సేవలను గూర్చి ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ ఎస్పీ సిబ్బంది అధికారులకు తెలియజేశారు. వాల్మీకి గొప్పతనం రామాయణం రచించిన ఆదికవిగా, శ్లోక రూపంలో ఇతిహాసం రచించిన తొలి కవిగా, మరియు ఒక బందిపోటు నుండి మహర్షిగా మారిన జీవితాన్ని కలిగి ఉండటం. రామాయణం ద్వారా మంచికి చెడుపై విజయం అనే సందేశాన్ని అందించారని అన్నారు.
ఈ కార్యక్రమం లో పోలీస్ క్యాంపు సిబంది, పి ఆర్ ఓ రామాచారీ తదితరులు పాల్గొన్నారు.


