గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
అభివృద్ధి ముసుగులో దోచుకుతిన్న గత పాలకులు
పనుల జాతర శంకుస్థాపనలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ, పరకాల :
పనుల జాతర – (2025) పనుల ప్రారంభోత్సవం సందర్బంగా ప్రభుత్వం కొత్తగా ప్రారంభించే పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. పరకాల మండలం నాగారం గ్రామంలో అంగన్వాడీ భవనం, అలియాబాద్ లో పంచాయతీ భవనం, పోచారంలో అంగన్వాడీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నడికూడ మండలం కంటాత్మకూర్ గ్రామంలో పలు పనుల శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమంలో, రాయపర్తిలో అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన ధ్యేయమని అన్నారు. ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతిన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, బుర్ర దేవేందర్ గౌడ్, పర్నెం తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, పాడి ప్రతాపరెడ్డి, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


