గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయం
బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచ్ యాకాంతం గౌడ్
గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
కాకతీయ, నెల్లికుదురు : గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే ధ్యేయమని సర్పంచ్ డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి లో మంగళవారం 6వ వార్డు సభ్యులు పిడుగు అనంత యాదగిరి ఆధ్వర్యంలో ముదిరాజ్ కాలనీలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల ద్వారా మంజూరైన సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ డాక్టర్ చిర్ర యా కాంతం గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్లు ప్రారంభించామని గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జెల్ల పరుశరాములు, తాళ్ళ మునేష్, బొల్లు మురళి, జెల్ల ఎల్లమ్మ పరుశురాములు కార్యదర్శి రవి, వివిధ కులసంఘ పెద్దలు పిట్టల యాకయ్య, జెల్ల సోమయ్య, షేక్ అజీమ్, వేములకొండ ఉమేష్, సింగారపు యాకేష్, వెంకన్న, వీరేందర్, రామకృష్ణ, ఎస్ కె. అమీర్ పాష, మాదగాని సోమయ్య, పిడుగు యాకయ్య, ఉప్పలయ్య,భిక్షం, కారం ప్రశాంత్, బొల్లు యాకన్న, చింతకుంట్ల నాగమురళి, కోల నర్సయ్య, నిమ్మల హరిబాబు,బీసు రాజాలు, పొట్టకార్ల శ్రీను,యాకయ్య, చెనబోయిన మల్లయ్య, అక్కెర కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


