epaper
Wednesday, March 25, 2026
epaper

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు..
కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి
మార్చి చివరి వారం చిన్న చిత్రాల సందడి
‘బ్యాండ్ మేళం’తో యూత్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్
సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘సుయోధన’
కామెడీ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ‘G.O.A.T’
తమిళ హిట్ ‘యూత్’ తెలుగు డబ్బింగ్ రిలీజ్
జీవీ ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’పై ఆసక్తి
ఓటీటీలోనూ కొత్త కంటెంట్ల వ‌రుస‌

కాకతీయ,సినిమా : కంటెంట్ బలంగా ఉంటే స్టార్ అవసరం లేదని మరోసారి నిరూపించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. మార్చి చివరి వారం థియేటర్లలోకి వస్తున్న చిత్రాలు కథలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మార్చి నెలలో ఇప్పటికే పెద్ద సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న నేపథ్యంలో ఇప్పుడు చిన్న సినిమాల వంతు వచ్చింది. యంగ్ హీరోలు, కొత్త కాన్సెప్ట్‌లు, విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ వారం విడుదలలలో ‘బ్యాండ్ మేళం’ ముందంజలో ఉంది. ‘కోర్ట్’ మూవీతో గుర్తింపు పొందిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో బావ మరదళ్ల ప్రేమ కథగా తెరకెక్కింది. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన ‘సుయోధన’ సైకలాజికల్ థ్రిల్లర్‌గా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోకి మాత్రమే కనిపించే ప్రత్యేక శక్తి చుట్టూ కథ నడవడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటించిన ‘G.O.A.T’ చిత్రం కూడా మార్చి 26న రిలీజ్ అవుతోంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సరదా కామెడీ కథతో ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘యూత్’ చిత్రం తెలుగు డబ్బింగ్‌తో మార్చి 26న విడుదల కానుంది. స్కూల్ నేపథ్యంలో సాగనున్న ఈ కథ యంగ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తోంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘హ్యాపీ రాజ్’ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరో అబ్బాస్ మళ్లీ తెరపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఓటీటీలో రిలీజ్‌లు

థియేటర్లతో పాటు ఓటీటీ వేదికల్లో కూడా ఈ వారం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బైట్’, ‘ప్రెటీ లేథల్’, ‘హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2’, ‘ఓ రోమియో’, ‘విష్ణు విన్యాసం’ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నెట్ ఫ్లిక్స్‌లో ‘హార్ట్ బ్రేక్ హై సీజన్ 3’, ‘హోమిసైడ్ సీజన్ 3’, ‘ఇన్ సైడ్ సీజన్ 3’, ‘సమ్ థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్’, ‘ద రెడ్ లైన్’, ‘మర్దానీ 3’, ‘డిటెక్టివ్ హోల్’ విడుదల కానున్నాయి. జియో హాట్ స్టార్‌లో ‘ది కమ్ బ్యాక్’, ‘డేర్ డెవిల్ బోర్న్ అగైన్ 2’, ‘కాట్టాన్’, ‘హన్నా మొంటానా స్పెషల్’, ‘చిరాయ’ ప్రసారం కానున్నాయి. జీ5లో ‘ప్రజాపతి 2’, ‘హే కాయ్ నవీన్’, ‘భానుప్రియ భూటర్ హోటల్’ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. యాపిల్ టీవీలో ‘ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5’ విడుదల కానుంది. ఆహాలో ‘అమరావతికి ఆహ్వానం’, సన్ నెక్స్ట్‌లో ‘సీతా పయనం’, ఈటీవీ విన్‌లో ‘సుమతీ శతకం’, ‘సీతారాములు’ ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉన్నాయి.
ఇటీవలి కాలంలో ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. కథ బాగుంటే చిన్న సినిమాలకూ భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలవుతున్న చిత్రాలు కూడా తమ కంటెంట్‌తోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

ప్లీజ్ ఆ వీడియోలు పెట్టొద్దు.. ర‌ణ‌వీర్ రెక్వెస్ట్‌

ప్లీజ్ ఆ వీడియోలు పెట్టొద్దు.. ర‌ణ‌వీర్ రెక్వెస్ట్‌ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు...

వెట్రి కళగం ప్రస్థానంపై కొత్త చర్చలు

వెట్రి కళగం ప్రస్థానంపై కొత్త చర్చలు త్రిష పాత్రపై తమిళనాడులో గుసగుసలు కాకతీయ, సినిమా:...

31న ‘కథానార్’ టీజర్ గ్లింప్స్ విడుదల

31న ‘కథానార్’ టీజర్ గ్లింప్స్ విడుదల హారర్ థ్రిల్లర్‌గా రానున్న అనుష్క‌ చిత్రం కాకతీయ,...

‘ధురంధర్’ ‘షోలే x 100’ స్థాయి సినిమా

‘ధురంధర్’ ‘షోలే x 100’ స్థాయి సినిమా ‘కొత్త సినిమాటిక్ యుగానికి...

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు ఉగాది రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల ఐదు వారాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img