కాకతీయ, బయ్యారం : మండలంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం పట్టణ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి పై హత్యా యత్నం చేసిన వారిని అరెస్టు చేయాలంటూ రెండో రోజూ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు దీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితులపై చర్యలకు పార్టీ నాయకులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో పునారావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు చీమల వెంకటేశ్వర్లు, ఇతర ముఖ్య మండల నాయకులు నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కూలిపోయిన వెంకటేశ్వర్లు, తొట్టి అశోక్, తదితరులు పాల్గొన్నారు.


