- యువతి బలవన్మరణానికి కారణమైన యువకుడు..
- గోదావరి నదిలో దూకి ఆత్మహత్య..
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రేమ పేరుతో యువతిని వేధించి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడు సైతం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం. వాటోలి గ్రామానికి చెందిన బండోల్ల నరేష్ (21) అదే గ్రామానికి చెందిన యువతి భూంపల్లి అఖిల ను ప్రేమ పేరుతో వేధించగా ఆమె ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోగా, ఆమెను వేధించిన యువకుడు బండోల్ల నరేష్ సైతం ఆదివారం సాయంత్రం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. సోమవారం అటువైపు వెళ్లినవారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మృతుని తల్లి బండోల్ల ముత్తవ్వ లోకేశ్వరం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కోర్టుకు చేర్చి పంచనామ నిర్వహించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


