ఆకునూర్ లో తై బజార్, షేటర్లు వేలం
*సర్పంచ్ కొమ్మురవి
కాకతీయ, చేర్యాల:మండలంలోని ఆకునూర్ గ్రామపంచాయతీకి చెందిన షేటర్లు, అంగడి బజారు (కూరగాయల మార్కెట్ )కు శనివారం వేలం పాట వేయనున్నట్లు గ్రామ సర్పంచ్ కొమ్మురవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఆసక్తి గలవారు ధరవాతు రూ, 5వేలు చెల్లించాలని అలానే ఉదయం 10 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకోవాలని సర్పంచ్ రవి తెలిపారు.


