పరీక్షలు ప్రశాంతంగా జరగాలి
మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేదు
జిల్లా కలెక్టర్ అంకిత్
కాకతీయ, కొత్తగూడెం : పదవ తరగతి వార్షిక పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. పరీక్షల పారదర్శకతను కాపాడాలని అధికారులకు సూచించారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలో పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింగరేణి కాలరీస్ హై స్కూల్, సెయింట్ మేరీస్ హై స్కూల్, బాబు క్యాంపు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పరీక్షల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులకు త్రాగునీరు, విద్యుత్, కూర్చునే సదుపాయాలు, పరిశుభ్రతపై ఆరా తీశారు. అవసరమైన చోట్ల తక్షణమే మెరుగులు చేర్చాలని ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు. అక్రమాలకు తావివ్వకూడదని హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా చర్యలను సమీక్షించారు. గుంపులు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని కేంద్రాల్లో శాతం శాతం హాజరు నమోదైందని అధికారులు తెలిపారు.


